మా పరిచయం

ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండరీస్‌ గురించి సంక్షిప్తంగా

గత 12 సంవత్సరాలకు పైగా, ఉక్కు తయారీ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి పధంలో ముందువరుసలో ఉంటూ వస్తున్నాం. పరిశోధన మరియు నిరంతర ఆధునీకరణలతో నడిపించబడుతూ ఉక్కు తయారీ పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగాము.

పునాది స్థాపన

2005 సం||లో ప్రారంభించబడి, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే మన్నికతో కూడిన మరియు అత్యుత్తమ ఉక్కు ఉత్పత్తుల ప్రముఖ తయారీదారుగా నిలిచాము. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలో ప్లాంట్లు కలిగి సంవత్సరానికి 1,50,000 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాము. ప్రస్తుతం, మా ఉత్పత్తి ప్రణాళికలలో భాగంగా, 2020 సంవత్సరానికి 2,50,000 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిపై దృష్ఠి కేంద్రీకరించాము.

మంచి భవిష్యత్తుకు మార్గం ఏర్పాటు

నూతన మార్పులకు అగ్రపీఠం వేస్తూ, ఉత్తమ ప్రమాణాలను కొనసాగిస్తూ, ఉక్కు తయారీలో సంపూర్ణమైన మార్పు తీసుకురావడానికే మేము ఉన్నాము.

2005 సం|| నుంచి నిర్మాణ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణ

2005 సం||లో మా సంస్థ స్థాపించబడి, అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మూడు ఫ్యాక్టరీలు కలిగి సమగ్ర ఉక్కు కర్మాగారంగా పరిణతి చెందింది. 350 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అధునాతన తయారీ సౌకర్యాలు కలిగి సం||నికి ప్రస్తుతం ఉన్న 1,50,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి 2020సం||నికి 2,50,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకోవాలని భావిస్తున్నాము. సంస్థ అభివృద్ధికి కేంద్రమైన నిత్యనూతన ఆవిష్కరణతో, దక్షిణ భారతదేశంలో 500, 550, 600 గ్రేడ్‌ ఉక్కు కడ్డీలను తయారుచేసిన మొట్టమొదటి స్టీల్‌ కంపెనీ మాదే.
అనేక సంవత్సరాలుగా దక్షిణ భారతదేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఉంటూ 750కి పైగా ఛానెల్‌ పార్ట్‌నర్‌లతో, మరియు 100కు పైగా ప్రత్యేక (ఎక్స్‌క్లూసివ్‌) ఛానెల్‌ పార్ట్‌నర్‌లతో వ్యాపారం చేస్తూ, నాణ్యత మరియు ఆవిష్కరణలపై నమ్మకత్వాన్ని పెంపొందించుకుని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణపట్నం ఓడరేవు మొదలైన జాతీయ ప్రాముఖ్యత గల ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో పాలుపంచుకొన్నాము.
ఉక్కు పరిశ్రమలో అగ్రగామిగా, దేశంలోని నిర్మాణలలో నాణ్యతను పెంచడం మరియు మెరుగుపరచడం మా బాధ్యత అని నమ్ముతున్నాము.