వ్యాపారానికి మించి

మానవ జన్మ మనకు ఇవ్వబడినది కానీ మానవత్వాన్ని నిలుపుకోవడం అనేది ఒక ప్రధాన ఎంపిక అని ఎంఎస్‌ లైఫ్‌ స్టీల్‌ బలంగా విశ్వసిస్తున్నాము. ఆ స్ఫూర్తి మాకు సమాజానికి ఎంతో కొంత సహాయము చేయడానికి, కొన్ని చిన్న అడుగులు వేయడానికి తోడ్పడింది.

మా ప్రారంభ అడుగులు:

నిరుపేదలకు పోషకాలతో కూడిన, తగినంత ఆహారం అందించాలనే దృష్టితో ప్రారంభించినదే మా ఒక టన్నుకు ఒక భోజనం ప్రణాళిక. ఒక టన్ను ఉక్కు అమ్మకానికి ఒక భోజనం చొప్పున మేము అందించే అన్నదాన కార్యక్రమమే ఒక టన్నుకు ఒక భోజనం పధకం.

ప్రస్తుతం దక్షిణ భారతదేశవ్యాప్తంగా నెలకు 6000 భోజనాల చొప్పున అందించి సేవ చేయగలుగుతున్నాం మరియు అనేక అనాధాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల, లాభాపేక్షలేని వృద్ధాశ్రమాలలో మాకు విలువైన భాగస్వాములున్నారు మరియు శ్రీ సత్యసాయి నిత్యాన్నసేవ, ఇస్కాన్‌ లాంటి సంస్థలు మా ఈ ప్రయత్నంలో సహాయం చేస్తున్నాయి.

నిజానికి, మా డీలర్లలో అనేకమంది కూడా ఆర్థికంగా గానీ లేదా ఈ సంస్థలకు అవసరమైన ఫ్యాన్‌లు, వాటర్‌ ప్యూరిఫైయర్‌లు, సరుకులు మొదలైన వనరులను విరాళమివ్వడం ద్వారా సాయపడటంలో ముందుంటారు.

ఇటువంటి లబ్దిదారుల్లో దేవ్‌నర్‌ పాఠశాల ఒకటి మరియు రాబోయే సంవత్సరాలలో, అనేక మందిని చేరాలని, వారి జీవితాలను స్పృశించాలని ఆశిస్తున్నాము.

వైద్యశిబిరాలు మరియు రక్తదాన శిబిరాలు

మరొక చిన్న అడుగు ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రతి సంవత్సరం, మా ఫ్యాక్టరీలలో కంటి పరీక్షలతో పాటు మెడికల్‌ చెకప్‌లు మరియు మా యొక్క మహిళా ఉద్యోగుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం, మా అన్ని ఫ్యాక్టరీలలో ఇలాంటి దాదాపు 10-15 శిబిరాలు ఏర్పాటు చేశాము. వీటన్నింతో పాటు మా ఉద్యోగుల వైద్య అవసరాల నిమిత్తం ఎప్పుడు ఫోన్‌ చేసినా ఒక డాక్టర్‌ సిద్ధంగా ఉంటారు. సెయింట్ థెరెసా హాస్పిటల్‌ వారి రక్తనిధితో అనుసంధానంగా రక్తశిబిరాలు నిర్వహిస్తుాంము మరియు రక్తదానంలో భాగస్వాములయ్యేట్లుగా మా ఉద్యోగులను ప్రోత్సహిస్తుాంము.

తాపీ పని చేసేవారు మంచి ఆరోగ్యం పొందడానికి మరియు వారి ఆరోగ్యం, సంక్షేమం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవడానికి వారి కోసం కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాము. ఈ శిబిరాల్లో సాధారణ బాడీ చెకప్‌, కంటి పరీక్షలు రెండూ నిర్వహిస్తాము.

అనేక మంది గుర్తించి, వ్యాపారానికి మించి వారి జీవితాలను స్పృశించాలనే మా ఆలోచనను అమలు పరచడానికి ఈ చిన్న అడుగులు సాయపడతాయి.