గనుల నుంచి మిల్లుల వరకు
భారతదేశ ఉక్కు తయారీదారులు
భారతదేశ ఉక్కు తయారీదారులు
ఎంఎస్ లైఫ్ స్టీల్ భారతదేశంలో ప్రముఖ గనుల నుంచి మిల్లుల దాక ప్రాథమిక ఉక్కు తయారీదారు. ఇది హాట్ రోల్డ్, స్పాంజ్ ఐరన్, బిల్లేట్స్ టిఎంటి కడ్డీలను ఉత్పత్తి చేస్తుంది. 2005 సం||లో ప్రారంభించబడి, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే విలువలతో కూడిన మరియు అత్యుత్తమ ఉక్కు ఉత్పత్తుల ప్రముఖ తయారీదారుగా నిలిచాము.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్లాంట్లు కలిగి సంవత్సరానికి 1,50,000 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాము. ఇప్పుడు, మా ఉత్పత్తి ప్రణాళికల సోపానాలలో భాగంగా, 2020 సంవత్సరానికి 2,50,౦౦౦ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిపై దృష్టిని కేంద్రీకరించాము.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్లాంట్లు కలిగి సంవత్సరానికి 1,50,000 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాము. ఇప్పుడు, మా ఉత్పత్తి ప్రణాళికల సోపానాలలో భాగంగా, 2020 సంవత్సరానికి 2,50,౦౦౦ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిపై దృష్టిని కేంద్రీకరించాము.
మీ భవన నిర్మాణంలో ఎంఎస్‌లైఫ్ ఉక్కు కడ్డీలను కొని, ఉపయోగించడానికి గల 10 కారణాలు
అధికనాణ్యత గల ముడిపదార్థం
ఎంఎస్ లైఫ్ 600 ప్రపంచంలోని ఉత్తమ గనుల నుంచి తీసిన బొగ్గు మరియు ముడి ఇనుము లాంటి ఉత్తమ నాణ్యత గల పరీక్షించిన ముడి పదార్థాన్ని వాడుతుంది. అందువల్ల ముడి పదార్థథ నుంచే మంచి నాణ్యత అందించగలము.
జర్మన్ సాంకేతికత
దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ జర్మన్ సాంకేతికతను కలిగి ఉత్తమ నాణ్యత గల Fe 500 గ్రేడ్ ను మొట్టమొద అధికారికంగా ప్రవేశపెట్టి, ఉత్పత్తి చేసినది ఎంఎస్ లైఫ్ 600 స్టీల్ బార్స్.
భూకంప నిరోధకత
సమగ్ర ఉక్కు కర్మాగారమైన ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రై.లి. గృహం నుంచి వచ్చినదే ఎంఎస్‌లైఫ్ 600 స్టీల్ బార్స్. తక్కువ కర్బన స్థాయిలు మరియు అధిక భౌతిక లక్షణాలు సాగే గుణాన్ని మెరుగుపరచడమే గాక భూకంపాల నుంచి మంచి రక్షణను కూడా ఇస్తాయి.
మంచి బలమైన బంధం
ప్రత్యేకమైన రిబ్ రూపకల్పన ఎంఎస్‌లైఫ్ 600 రీబార్‌ను గట్టిగా చేస్తుంది. అది కాంక్రీటుతో దృఢమైన బంధం ఏర్పరచుకొని ఫలితంగా పటిష్టమైన నిర్మాణం ఏర్పడుతుంది.
పరిపూర్ణమైన వలయ నిర్మాణం
ఎంఎస్ లైఫ్ 600 తయారీలో ఉపయోగించిన అభివృద్ధి చెందిన సాంకేతికత కడ్డీ చుట్టూ పరిపూర్ణమైన వలయ నిర్మాణాన్ని ఏర్పరచి దానికి పరిపూర్ణమైన పట్టును ఇస్తుంది.
ప్రామాణీకతా పత్రం
ఎంఎస్‌లైఫ్ 600 స్టీల్ బార్స్ ప్రామాణికతా పత్రాన్ని (పరీక్షించి ఇచ్చిన సంపూర్ణ పత్రం) కలిగి ఉండి ప్రతి సరుకు కొనుగోలుకు ఈ పత్రం జతపరచబడుతుంది. మా వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తిని అందిస్తున్నామనే భరోసాను ఈ పత్రం ఇస్తుంది.
ధర తక్కువ - 15% వరకు ఆదా
వినియోగదారులు నిర్మాణ రూపకల్పనలో 15% వరకు ఉక్కు ఆదా చేయవచ్చు ఎందుకంటే ప్రస్తుతం వినియోగిస్తున్న Fe 500 కంటే Fe 600 అధిక బలం కలిగి ఉంటుంది కాబట్టి.
డబ్బుకు విలువ
ప్రామాణికమైన రేటు, బరువు, ధరల ఫార్ములాకు దక్షిణ భారతంలో మొదటగా కట్టుబడింది మేమే. ఎంఎస్‌లైఫ్ 600 ఒక్కొక్క లోహపు ముక్క చొప్పున అమ్మడం వల్ల మా గౌరవ వినియోగదారుల డబ్బుకు విలువ ఇస్తున్నాము.
అన్ని వర్గాల మిశ్రమ లభ్యత ISI బ్రాండింగ్
ఎంఎస్‌లైఫ్ 600 రీబార్ 8mm నుంచి 32mm డయామీటర్ గల విస్తృత శ్రేణి నాణ్యతతో పరీక్షించిన ఉత్పత్తులను అందిస్తుంది. ఇది ప్రామాణికమైన డీలర్ల వద్ద అనుకూలమైన ప్యాకింగ్‌తో సులభంగా లభిస్తుంది. గుర్తింపు యొక్క ప్రామాణికతను ప్రతిబింబించే విధంగా ప్రతి ప్యాకేజ్‌పై బ్రాండ్ పేరు, ISI చిహ్నం, వర్గం సంఖ్య ఉంటాయి.
మా ఉక్కు పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఉపయోగిస్తున్నారు
ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రై.లి. జాతీయ ప్రాముఖ్యత గల ప్రాజెక్టులతో సంబంధాన్ని కలిగి ఉండటాన్నిబట్టి గర్విస్తోంది. కొన్ని పెద్ద ప్రాజెక్టులు, హైదరాబాద్, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవులు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రోరైలు ప్రాజెక్ట్, మెగా పవర్ ప్లాంటు ప్రాజెక్ట్, నేషనల్ హైవేలు, అనేక పెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.
టిఎంటి 600 ఎందుకు ?
- ఉత్తమ, స్థిరమైన నాణ్యత గల ఉత్తమ గ్రేడ్ (600) ఉక్కు
- తక్కువ కర్బన స్థాయి, అధిక భౌతిక లక్షణాలు సాగే గుణాన్ని మెరుగుపరచి, భూకంపాల నుంచి మంచి రక్షణను ఇస్తాయి.
- ఎంఎస్‌లైఫ్ స్టీల్ యొక్క Fe 600 రీబార్స్ 16% సాగే గుణాన్ని కలిగి ఉంటాయి.
- ప్రత్యేకమైన రిబ్ రూపకల్పన కడ్డీలు కాంక్రీటుతో బలమైన బంధాన్ని ఏర్పరచడానికి సాయపడి పిష్టమైన పునాది ఏర్పడుతుంది.
- ఎంఎస్‌లైఫ్ 600 తయారీలో ఉపయోగించిన అభివృద్ధి చెందిన సాంకేతికత కడ్డీ చుట్టూ పరిపూర్ణమైన వలయ నిర్మాణాన్ని ఏర్పరచి దానికి పరిపూర్ణమైన పట్టును ఇస్తుంది.
- అధిక బలానికి తక్కువ కడ్డీలు అవసరం, ఫలితంగా తక్కువ లోడ్‌తో అధిక నాణ్యత గల నిర్మాణం చేయవచ్చు.
- Fe 600 ఉపయోగం ఉక్కు వినియోగాన్ని 15% వరకు తగ్గిస్తుంది.
- తక్కువ ఉక్కు వాడకం వల్ల కార్మికుల ఖర్చు 15% వరకు తగ్గిస్తుంది.
సాంకేతికత & ఆవిష్కరణ
- జర్మన్ సాంకేతికతను అందిపుచ్చుకొని, దక్షిణ భారతంలో ఎంఎస్ లైఫ్ స్టీల్ మొట్టమొదట 500 గ్రేడ్ టిఎంటి కడ్డీలు ప్రవేశపెట్టింది, తరువాత 550, ఆ తరువాత 600 గ్రేడ్‌లు ప్రవేశపెట్టింది.
- ముడి పదార్థాలు మరియు చివర ఉత్పత్తుల నిరంతర, తీవ్రమైన పరీక్షల కోసం అధునాతన ప్రయోగశాల
- నాణ్యత గల ఉత్పత్తికి ప్రపంచస్థాయి రోల్‌ల వాడకం
- ఉష్ణోగ్రతను 1000 నుంచి 200 కి తగ్గించడానికి అధిక వత్తిడితో నీరు చల్లడానికి ప్రోగ్రామ్ లాజిక్ కంట్రోల్ వ్యవస్థ & ఆటోవాటర్ వ్యవస్థల వాడకం.
- అధిక బలాన్ని పొందుకోవడానికి సాయపడే తగిన ఉష్ణోగ్రతను పొందుకొనేందుకు PCU సాంకేతికతను వినియోగిస్తున్న మార్గదర్శకులు.
- వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వారికి కావలసిన విధంగా పొడవు కత్తిరించి, వంచడానికి అనుకూలీకరించే ఆటోమేటెడ్ కట్ & బెండ్ యంత్రాలు.
- సరైన ఖచ్చితత్వానికి, ధర మరియు సమయం ఆదా చేయడానికి కట్ & బెండ్ మిల్లులో నూతన ఇాలియన్ సాంకేతికత వాడకం.
- నిర్మాణ ప్రదేశంలో లభ్యం అయ్యే విధంగా ప్రాకృతిక ఉత్తమ శుద్ధి & పటిష్టమైన కడ్డీలే కాక సరుకు మరియు ఉత్పత్తి ధరల వృధాను తగ్గించే నవీకరణ యాజమాన్యం.
- మరలా వేడిచేసే ప్రక్రియ ద్వారా విషపూరిత వాయువులు వెలువడాన్ని ప్రత్యక్ష చార్జింగ్ నివారిస్తుంది.
- ఫ్యాక్టరీ నుంచి వెలువడే హానికర వాయువులను నివారించడానికి కావలసిన అనువయిన ప్రక్రియలను అవలంబించడము ద్వారా కాలుష్యాన్ని నివారించడమయినది.
నాణ్యత
- బొగ్గు & ముడి ఇనుము లాంటి ప్రధాన ముడి పదార్థాలు ప్రపంచంలోని ఉత్తమ గనులైన దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా గనుల నుంచి సేకరిస్తాం.
- పాడవని ముడి ఇనుముకు విస్తృత లోహ ప్రక్రియలు తోడై ఉక్కు పరిశుభ్రంగా ఉంది, సల్ఫర్ - ఫాస్ఫరస్ లాంటి హానికర పదార్థాలు లేకుండా ఉండి అవి భరోసా కల్పిస్తుంది.
- టిఎంటి కడ్డీలను వేగంగా చల్లబరచడానికి చల్లార్చే ప్రక్రియలో నీటిలో తాగదగిన RO నీటిని వాడటం వల్ల కొన్ని ప్రత్యేకమైన ధాతు ధర్మాలు లభిస్తాయి.
- ఎంఎస్ లైఫ్ స్టీల్ ఉత్తమ రోలింగ్ ప్రక్రియ ఎంఎస్‌లైఫ్ స్టీల్ టిఎంటి బార్‌లు సైజు నియంత్రణ కలిగి సిమెంట్ & కాంక్రీటు మధ్య పటిష్ట బంధాన్ని ఏర్పరచే రిబ్ రూపకల్పనతో పరిశ్రమలో ఉత్తమ పేరు సంపాదించుకొనింది.
- రిబ్ రూపకల్పన సామర్థ్యం A/R నిష్పత్తిగా పిలువబడే పరిమాణం నిర్ణయిస్తుంది. తద్వారా ఉక్కు, సిమెంట్ మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది.
- తుప్పు నిరోధకత
- ఉత్తమ వంగే గుణం, సాగే గుణం, నమ్యత
- ఎక్కువ కాలం మన్నిక కలిగినది.
- పరిపూర్ణ బరువు, పొడవు, సైజు, ప్రామాణిక కొలతలు అన్నివేళలూ
- ప్రతి సరుకు కొనుగోలు సమయంలో వినియోగదారులకు వారు ఉత్తమ నాణ్యత గల ఉత్పత్తిని పొందుతున్నారని తెలియజేసే ప్రామాణికత పత్రం ఇవ్వడం
- జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టులతో సంబంధం - అవి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ విమానాశ్రయం, గంగవరం & కృష్ణపట్నం ఓడరేవులు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రోరైలు, ఇతర మెగా పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు, ఇంకా అనేకం.
- స్టార్ ఎక్స్‌పోర్ట్ హౌస్ సర్టిఫైడ్ కంపెనీ (2006-2009)
- భారతప్రభుత్వ వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖచే ''బెస్ట్ స్టీల్'' అవార్డ్
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్
- ISO 9001-2000 సర్టిఫైడ్
- ఎంఎస్‌స్టీల్ టిఎంటి కడ్డీల రసాయన సమ్మేళనాలు, భౌతిక లక్షణాలు ఒకే విధమైన వలయం ఏర్పడుట కోసం చల్లార్చే ప్రక్రియలో IS 1786/08 ప్రమాణాలను మించిపోతున్నాయి.
వ్యాపారం చేయడం సులభం
- ఆన్‌లైన్ ధరలు
- ఒక్కోలోహపు ముక్క చొప్పున అమ్మకం - డబ్బుకు విలువ, బరువులో అసమానతలు నివారించడం.
- వివిధ డయామీటర్ కలిగిన తాజా సరుకును నిర్వహించడం
- 8mm నుంచి 32mm డయామీటర్ కలిగిన విస్తృత శ్రేణి నాణ్యతా పరీక్షా ఉత్పత్తులు
- దక్షిణ భారతదేశ వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు కలిగి సరుకును సకాలంలో అందించడం.
- ప్రతి కొనుగోలు అనుకూల ప్యాకింగ్‌తో పాటు బ్రాండ్ పేరు, ISI చిహ్నం, సెక్షన్ గ్రేడ్ ప్రతి రాడ్డుపై టెస్ట్ సర్టిఫికెట్ తో సహా ముద్రించబడి ఉంటుంది.
- దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 750 అధీకృత ఛానెల్ పార్ట్‌నర్‌లు, మరియు 100 పైగా ప్రత్యేక (ఎక్స్‌క్లూజివ్) ఛానల్ పార్ట్‌నర్‌లతో కలిపి బలమైన నెట్వర్క్ కలిగి ఉండటం వల్ల సులభ లభ్యత.
పర్యావరణం
- సుస్థిరాభివృద్ధిపై పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా స్థిర భవిష్యత్ ఏర్పడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మా ప్రయత్నాలతో కూడుకొన్న అనేక ప్రారంభ అడుగులు.
- శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఇనుము కరిగించే కొలిమి నుంచి వ్యర్థ వాయు ఉష్ణాన్ని వెలికితీయడానికి వ్యర్థ ఉష్ణ వెలికితీసే సౌకర్యం.
- కాలుష్య రహిత ఫ్యాక్టరీలు
- ఘన వ్యర్థాలను 80% పునఃచక్రీయం / పునఃఉపయోగం ద్వారా బాధ్యతాయుతమైన వ్యర్థాల యాజమాన్యం. మిగిలిన 20% లోతట్టు ప్రాంతాలను నింపడానికి మరియు రహదారిపైభాగ నిర్మాణానికి ఉపయోగించడం.
- వ్యర్థజల ప్రవాహాలలో ఉత్సర్గమైన కాలుష్యకాల స్థాయిని తగ్గించడానికి మనకు లభ్యమవుతున్న మంచి భౌతిక-రసాయన పద్ధతులతో వ్యర్థ జల చికిత్స మరియు పునఃచక్రీయం చేయడం ద్వారా పారిశ్రామిక వ్యర్థ జల నిర్వహణ
- కోక్ కర్మాగారం నుంచి విడుదలయ్యే వ్యర్థ జలంలో రసాయన కాలుష్యకాలు ఆక్సీకరణం చెంది, సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చేయబడి జీవశాస్త్రీయంగా శుద్ధి చేయబడుతుంది.
- 10 లక్షల మొక్కలు నాటడం ద్వారా ఫ్యాక్టరీల చుట్టూ పచ్చి వాతావరణము ఏర్పరచడం
- భూగర్భ జల రీచార్జ్ సౌకర్యాలతో పాటుగా పెద్దమోతాదులో వాననీటిని ఒడిసిపట్టే నిర్మాణాలను స్థాపించడం ద్వారా నీటి సంరక్షణ ప్రయత్నాలు
- నీటిని వెలికి తీయడం, పునఃచక్రీయం చేయడం
- భూగర్భజలం యొక్క కృత్రిమ రీచార్జ్
- జల ఉత్సర్గ రహితం
- ఈ జలసంరక్షణ ప్రయత్నాలు ఉపరితలంపై ప్రవహిస్తున్న నీటిని కాపాడటంతోపాటు ప్రాజెక్టు ప్రాంతాల్లో మరియు లోతట్టు గ్రామాల్లో లోపల, చుట్ట పక్కల భూగర్భజలాలు క్రమేణా, స్థిరంగా పెరగడానికి దోహదం చేస్తాయి.
మా ఉత్పత్తులు
ఎంఎస్ లైఫ్ స్టీల్ సమగ్ర ఉక్కు కర్మాగారం ఉత్తమ నాణ్యత గల 600 గ్రేడ్ టిఎంటి ఉక్కు కడ్డీలను మరియు ఆటోమేటెడ్ కట్ & బెండ్ యంత్రాలను ఉపయోగించి టైలర్ మేడ్ ఉక్కు ఉత్పత్తులను తయారుచేస్తుంది.
సమగ్ర ఉక్కు కర్మాగారం
మాకున్న ఉన్నత నాణ్యతా ఉత్పత్తులు మరియు సేవకు కారణం ఏమిటంటే మాకు అంటే గనుల నుంచి మిల్లుల వరకు సమగ్ర ఉక్కు కర్మాగారం ఉన్నదని చెప్పవచ్చు. ఇందువల్ల అత్యుత్తమ నాణ్యత గల ఉక్కు తయారు చేయడానికి BIS ప్రమాణాలకు మించి భౌతిక లక్షణాలు మరియు రసాయన సమ్మేళనాలు సాధించడానికి ఈ మొత్తం ప్రక్రియ మీద మాకు పూర్తి నియంత్రణ ఉంది. అంతేకాక సమగ్ర ఉక్కు కర్మాగారం కలిగి ఉండటం వల్ల కూడా మాకు నాణ్యత, ధరలు మరియు సమయానికి పంపిణీ చేయడంపై పూర్తి నియంత్రణ ఉంది.
వినియోగదారుల సాక్ష్యాలు
మా బ్లాగ్స్
MS లైఫ్ స్టీల్ భారతదేశంలోని పది మేటి పరిశ్రమలలో ఒకటిగా ఉపయోగించే వినూత్న సాంకేతికత
ఆధునిక సాంకేతికతను …
మా క్లయింట్లు
40+ హ్యాపీ క్లయింట్లు మరియు పెరుగుతున్న!
మాతో పని చేయండి
మాతో భాగస్వామి