Blog

MS లైఫ్ స్టీల్ భారతదేశంలోని పది మేటి పరిశ్రమలలో ఒకటిగా ఉపయోగించే వినూత్న సాంకేతికత

ఆధునిక సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు పోటీతత్వపు ప్రయోజనాన్ని ప్రముఖంగా కలిగి వుంటాయి. స్టీల్ పరిశ్రమలోని కంపెనీలకు యిది మినహాయింపేమీ కాదు. భారతదేశంలోని పది స్టీల్ కంపెనీలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వాని పోటీదారులపై ఆధిక్యతను సంపాదించినాయి. ఏ నిర్మాణ రంగ ప్రాజెక్టులో ఉపయోగించ బడు ముడి పదార్థముల నాణ్యతకు ప్రాధాన్యత వుంటుంది. అందువలన ముఖ్యమైన మెటీరియల్ గా నిర్మాణ రంగంలో స్టీల్ తన స్థానాన్ని కైవసం చేసుకున్నది స్టీల్ TMT బార్లు గృహ సంబంధమైన లేదా భారీ స్థాయి నిర్మాణాలలో ప్రాథమికంగా ఉపయోగించ బడుతున్నాయి.

MS లైఫ్ వారి TMT బార్లు నిర్మాణ రంగంలో గణనీయంగా పెరగడానికి మూలకారణము వాటి యొక్క ఆధునిక సాంకేతికత లక్షణాలు మాత్రమే. ఈ బార్లు ధృడంగా వుండి, మన్నిక కలిగి, త్రుప్పు పట్టకుండా మరియు సాగేందుకు వీలుగా వుంటాయి. ఈ అపూర్వ లక్షణాల కలయిక వలన మన నిర్మాణ రంగంలో యివి తప్పనిసరిగ ఉపయోగించ బడుతాయి. మంచి మెటీరియల్స్ కలయిక వలన నూతన సాంకేతికతతో ఉత్పత్తి అయిన ఈ బార్లు ఎక్కువ ఉపయోగితకు మూలమౌతున్నాయి.

ఈ క్రింది విషయాలను పరిశీలించుదాం.

  1. జర్మన్ సాంకేతికత : ఉత్పత్తి విధానము ఆధునాతన జర్మన్ సాంకేతికతపై ఆధారపడి యున్నది. అధిక ధృడత్వం కలిగిన బార్లు ఉత్పత్తి కావడానికి యీ సాంకేతికత ప్రధాన కారణమని మనం గుర్తించాలి. జర్మన్ సాంకేతికతను ఉపయోగించి MS లైఫ్ 500, 550 మరియు 600 గ్రేడ్ TMT బార్లను దక్షిణ భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నది.
  2. నాణ్యత గల ముడి సరుకులు : ఉత్పత్తి విధానంలో అత్యంత నాణ్యత కలిగిన ముడి సరుకులను ఉపయోగించడం జరుగుతుంది. ప్రపంచంలోని గొప్ప గనుల నుండి ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. ముడి పదార్థాలు దక్షిణ ఆఫ్రికా తదితర దేశాల నుండి వస్తాయి.
  3. ఉత్తమ బంధము : సాంకేతిక వినూత్నత వలన 600 TMT బారు కూడా సిమెంట్ తో మిళితమై ధృడమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దీని వలన సులువుగా నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చును.
  4. ఆల్టా – ఆధునిక ల్యాబ్ : కటింగ్ ఎడ్జ్ ల్యాబ్ ముడి పదార్థముల నాణ్యత పరిశీలనలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఉత్పత్తి అయిన వానిని నాణ్యతా ప్రమాణాలకు అనువుగా వున్నాయా లేదా యని నిర్ధారణ చేస్తుంది.
  5. ఆటో కట్ మరియు బెండ్ మెషీన్ : MS లైఫ్ యొక్క TMT బార్లు ఆధునిక నిర్మాణాలకు అనువుగా వుండి అద్భుతమైన ఫలితాలనిస్తాయి. అవసరాలకు తగినట్లుగా వాటి పొడవు మరియు వంపులను యంత్రాల సాయంతో పొందవచ్చును. MS లైఫ్ ఆధునాతన ఇటాలియన్ కట్ మరియు బెండ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నది.
  6. PUC సాంకేతికత : ఉత్పత్తి అయ్యే వివిధ దశలలో ఈ బార్లు విభిన్నమైన ఉష్ణోగ్రతలకు లోనౌతాయి. PUC సాంకేతికత వలన ఉత్తమ శ్రేణి ఉష్ణోగ్రతా ప్రమాణాలను TMT బార్లు కలిగి వుంటాయి.
  7. ప్రోగ్రామ్ లాజిక్ కంట్రోల్ సిస్టమ్ : ఇది వినూత్న సాంకేతికతకు సక్రమమైన నిదర్శనము. దీని కారణంగా ఆటో వాటర్ సిస్టమ్ వలన ఎక్కువ పీడనంతో ఉష్ణోగ్రతను తగ్గించవచ్చును.

ముగింపు : ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం MS లైఫ్ యొక్క ముఖ్యోద్దేశ్యము. అత్యాధునికత సాంకేతికతకు అనుగుణంగా నాణ్యతను పెంచుకొనుటకు తగిన పరిధి వుంటుంది. భారతదేశంలో పది అత్యుత్తమ స్టీల్ కంపెనీలలో ఒకటిగా MS లైఫ్ వినూత్నతను పొందేందుకు ఎన్నడూ సందేహించలేదు. నాణ్యతాపరంగా స్థిరత్వాన్ని సాధించేందుకు చేయు ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి.