Blog

ఇంటి నిర్మాణానికి ఉత్తమ టిఎంటి గ్రేడ్‌

ప్రస్తుతం నిర్మాణాలలో టిఎంటి ఉక్కును అందరు సాధారణంగా వాడుతున్నారు. టిఎంటి అంటే ఏమి? ఇతర రకాల ఉక్కు కంటే దీనినే ఎందుకు ఉపయోగిస్తున్నారు ? టిఎంటి ఉక్కు రాకముందు భవన నిర్మాణాల్లో కాంక్రీటుతో పాటు మైల్డ్‌స్టీల్‌ (MS) కడ్డీలు, కోల్డ్‌ ట్విస్టెడ్ డీఫార్మ్‌డ్‌ (CTD) కడ్డీలు ఉపయోగించేవారు. అయితే ఇటువంటి ఉక్కు Fe 250 గ్రేడ్‌ను కలిగి ఉండి దాని తక్కువ బలం కారణంగా అధికశక్తి అవసరమైన భవనాలకు సమస్యగా మారింది.

టిఎంటి రీఇన్‌ఫోర్స్‌ మెంట్ కడ్డీలు

ధర్మోమెకానికల్లీ ట్రీటెడ్ (TMT) కడ్డీలు భారతదేశంలో 2002-2005 సంవత్సరాలలో ప్రవేశపెట్టబడ్డాయి.  ఇవి వాటి నాణ్యతా బలం మరియు సాగేగుణం వల్ల ముందున్న ఉక్కు రకాల కంటే పురోగతి చెందినది. టిఎంటి ఉక్కు కడ్డీలు ఇతర ఉక్కు లాగానే ఉత్పత్తి అవుతాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన దశలు వీటిని ప్రత్యేమైనవిగా చేస్తాయి. అవి :
  • చల్లార్చడం
  • ధృడంగా రూపాంతరము చెందడము
  • సాగేగుణం కలిగి ఉండడము.

చల్లార్చే ప్రక్రియలో రోలింగ్‌ మిల్లు నుంచి వస్తున్న వేడి కడ్డీలు వరుస నీటి జెట్ ల ద్వారా వేగంగా చల్లార్చబడతాయి. క్రమపద్ధతిలో చల్లబర్చానికి కడ్డీలలోని వివిధ విభాగాల ద్వారా ఉష్ణోగ్రత తేడాల నిర్వహణలో నీటి జెట్ ల పీడనాన్ని నియంత్రించడానికి ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఫలితంగా ఉపరితలము వేడిగా ఉన్న అంతర్భాగము మెత్తగా కూడిన మార్టెన్ సైట్ గా పిలువబడే దృఢమైన బాహ్యతలం గల కడ్డీలు ఏర్పడతాయి. స్వయంగా ధృడపడే దశలో అంతర్బాగము నుంచి ఉష్ణం బాహ్య చల్లటి ఉపరితలానికి ప్రసరిస్తుంది. దీనివల్ల బాహ్య మార్టెన్ సైట్ పొర గట్టిపడి ”టెంపర్డ్‌ మార్టెన్ సైట్”గా పిలువబడుతుంది.

రూపాంతర దశలో ప్రత్యేకంగా కూలింగ్‌ బెడ్‌పై ఉంచి చల్లార్చడం ద్వారా ఫరైట్ పేర్లైట్ మిశ్రమ సమ్మేళనంగా మారడం. ఫలితంగా అధిక శక్తి, సాగేగుణం, వంగే గుణం మరియు పరిపూర్ణ మిశ్రమంగా రీఇన్‌ఫోర్స్‌డ్‌ కడ్డీ ఏర్పడుతుంది. మరొక గుర్తించదగిన కారకం ఏమిటంటే లోపలి అంతర్భాగము మరియు కఠినమైన బాహ్యపొరలు ఏర్పడటం అనేవి పలురకాల కడ్డీలలో మనకు కనపడదు. కఠినమైన గట్టి మార్టెన్ సైట్ పోర ఉండటం అధిక తన్యతాబలానికి దారితీస్తుంది.

టిఎంటి వర్గీకరణ

టిఎంటి రీబార్‌ గ్రేడ్‌ Fe  415, ఇందులో 415 బలాన్ని సూచిస్తుంది. సాగే బలం, సాగేగుణం ప్రయోగాత్మకంగా మొట్టమొదట జతగలసినది. తరువాతి కాలంలో వివిధ గ్రేడ్‌ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం జరిగింది. అవి  Fe 415D, Fe 415S, Fe 500, Fe 500D, Fe 550S, Fe 550D, Fe 600  మొదలైనవి. ఇటీవలకాలంలో జరిగి అనేక పరిశోధనల అభివృద్ధి ఫలితంగా ఎంఎస్‌లైఫ్‌ 600 గ్రేడ్‌ ఉత్పత్తిలో కార్బన్‌ శాతాన్ని 0.2 శాతానికి తగ్గించడం ద్వారా, వంగే గుణం మరియు సాగే గుణం పెంచుతూ ఔరిరీ  ప్రమాణాలను అధిగమించినది.

టిఎంటి ఉక్కు కడ్డీలకు వివిధ గ్రేడ్‌లు ఏవిధంగా పొందవచ్చు ?

అధిక సాగే బలం గల ప్రత్యేక గ్రేడ్‌ స్టీల్‌ రీబార్‌లు Fe 415 ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన అదే టిఎంటి ప్రక్రియ ద్వారా పొందవచ్చు. టిఎంటి ప్రక్రియ వల్ల ఉపయోగం ఏమిటంటే ప్రక్రియలో కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా వివిధ గ్రేడ్‌ల స్టీల్‌ రీబార్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఉక్కును ఇంకొంచెం ఎక్కువ చల్లార్చడం వల్ల, బాహ్యమార్టెన్‌ సైట్ పొర స్టీల్‌ రీబార్‌కు అధిక బలాన్ని ఇచ్చి మందంగా చేస్తుంది. అదే మెత్తటి లోపలి అంతర్భాగము  దాన్ని పెళుసుగా చేస్తుంది.
ఏ టిఎంటి గ్రేడ్‌లో అయినా, సాగేగుణంలో రాజీపడని విధంగా తగిన నిష్పత్తిలో బాహ్య, లోపలి అంతర్భాగాలు ఉండాలి.  ఒకదాని కంటే మరొకి ఎక్కువ ఉంటే, టిఎంటికి తగిన లక్షణాలు ఉండవు.  లోపలి అంతర్భాగముతో సమానంగా బాహ్య పై భాగం కూడా పెరిగి టిఎంటి రీబార్స్‌ అధిక బలంతో ఉంటాయి.  అధిక సాగే బలం గల టిఎంటి స్టీల్‌ బార్స్‌ కావలసిన బాహ్య నాణ్యతే గానీ సాగే గుణం గల ఫెర్రీటే పియర్లిట్  లోపలి అంతర్భాగము కాదు.