Blog

టిఎంటి రీఇన్ఫోర్స్మెంట్ కడ్డీల పరీక్ష

థర్మోమెకానికల్లీ ట్రీటెడ్ (TMT) ప్రక్రియ నిర్మాణాలకు కావలసిన నాణ్యత మరియు అధికబలాన్ని ఇవ్వడానికి అభివృద్ధి చేయబడింది. టిఎంటి ప్రక్రియ ఉక్కు కడ్డీలకు అధిక సాగేగుణాన్ని ఇచ్చే పరిణామాత్మక ప్రక్రియ.  వివిధ గ్రేడ్‌లు గల టిఎంటి రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ ఉక్కులు Fe 415, Fe 500, Fe 550, Fe 600 ఇందులో గ్రేడ్‌లు అవి ఇచ్చే కనీస బలాన్ని సూచిస్తాయి.

ఈ బలం నిజమేనా ?

టిఎంటి రీఇన్‌ఫోర్స్‌డ్‌ కడ్డీలు దాదాపు ప్రతి స్టీల్‌ రీఇన్ఫోర్స్మెంట్ ప్రాసెసింగ్‌ కంపెనీలచే అధికంగా మార్కెటింగ్ చేయబడినా కూడా, టిఎంటి కడ్డీలు స్పర్శద్వారా అనుభూతి ద్వారా లేదా చూడటం ద్వారా గానీ పరీక్షించలేము.  ప్రస్తుతం రీఇన్ఫోర్స్మెంట్  కడ్డీలను ఎన్నుకోవడానికి సగటు మనిషికి ఉన్న ఒకే మార్గం ప్రామాణీకరణ ప్రక్రియ.  ప్రకటనల్లో   ప్రదర్శించిన విధంగా  రీఇన్‌ఫోర్స్‌డ్‌ కడ్డీలో ఉన్న లక్షణములు మరియు గుణాలు తెలియకపోతే సమస్యలు ఎదుర్కొంటారు.

పరీక్ష

శుభసమాచారం ఏమిటంటే రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ కడ్డీకి ప్రతిపాదిత బలాన్ని గుర్తించడానికి చేసే కొన్ని పరీక్షలు ఉన్నాయి. అవి :

  • పీడన పరీక్ష
  • సాగే శాతం పరీక్ష
  • వంచే మరియు మరలా వంచే పరీక్ష
  • రసాయన విశ్లేషక పరీక్ష
రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ ఉక్కు కడ్డీపై చేసే అతి సాధారణ పరీక్ష సాగే గుణంగల పరీక్ష. టిఎంటి రీబార్‌ యొక్క సాగే గుణం గుర్తించడానికి దాని సాగేగుణం పోగొట్టుకొనే వరకూ సాగదీసి దానిపై వత్తిడి కలిగిస్తారు.
సాగేశాతం అంటే విరిగిపోయే ముందు రీఇన్‌ఫోర్స్‌డ్‌ కడ్డీల విరూపం చెందే సామర్థ్యం యొక్క ప్రమాణం. టిఎంటి కడ్డీల గ్రేడ్‌లను ఎన్నుకోవడంలో బలానికి సమానమైన ముఖ్యకారకం సాగేగుణం. Fe 415 కి కనీస సాగే శాతం 14.5% కాగా Fe 500 కి సాగే శాతం 12%.  ప్రతి గ్రేడ్‌ టిఎంటికి ఒక ఉపయోగం ఉంది మరియు అవి ఆ ఉపయోగం కొరకే ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
వంచే మరియు మరలా వంచే పరీక్షలు రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ కడ్డీ యొక్క సాగే గుణాన్ని మూల్యంకనం చేయడానికి చేస్తారు.  వంచే పరీక్షలో ఉక్కు కడ్డీని సరిగ్గా మధ్యభాగంలో వంచడం వల్ల ఎటువిం పగుళ్లు లేకుండా వంగుతుంది.  రీబెండ్‌ లేదా మరలా వంచే పరీక్షలో ఉక్కుపై వత్తిడి కలిగించే వయస్సు ప్రభావాన్ని కొలుస్తారు.