Blog

టిఎంటి కడ్డీలు భవన నిర్మాణ పరిశ్రమను ఏ విధంగా పునర్నిర్వచించాయి

ఒక పరిశీలన

భారతదేశం, ఆర్థికపరంగా వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటి, దీనిలో భవన నిర్మాణ పరిశ్రమ ముఖ్య పాత్రను పోషిస్తుంది. భారతదేశంలో చిన్న స్థాయి నిర్మాణాల నుంచి పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల వరకు సాధారణంగా అనేక భవన నిర్మాణ ప్రదేశాలను చూస్తూ ఉంటాము. ఫలితంగా భారతదేశంలో పట్టణీకరణ 1940ల చివరిలో 11% ఉండగా వేగంగా పెరుగుతూ 2018కి 31%కి పెరిగింది.

వేగవంతమైన పట్టణీకరణ వివిధ కారకాల వల్ల ఉండవచ్చు.

  • మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వ అంగీకారం
  • రియల్‌ ఎస్టేట్ మరియు భవన నిర్మాణ రంగాలు వాటి అనుబంధ పరిశ్రమలన్నింనీ వేగంగా వృద్ధి చేయడం.

వృద్ధికి భాగస్వామి

ఈ ప్రయత్నంలో, రియల్‌ ఎస్టేట్ రంగం దానికదే స్వీయపోషక రంగంగా ఎదుగుతూ, బాగా చదువుకున్నవారికి, అదేవిధంగా కొంచెం తక్కువ చదువుకున్న వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించింది. అదే సమయంలో, రియల్‌ ఎస్టేట్ రంగం యొక్క వృద్ధికి మద్దతుగా పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు సిమెంట్ తయారీ కంపెనీలు, టిఎంటి కడ్డీల తయారీ కంపెనీలు, కార్మికులను సమకూర్చే సంస్థలు, భవన నిర్మాణవేత్తలు, డిజైనర్‌లు, ప్రణాళికవేత్తలు, ఇంకా ఎన్నెన్నో. ప్రభుత్వం నియమాలు, ప్రమాణాలు ఏర్పరచి ఇవన్నీ సరిగ్గా జరిగేలా చేసింది. అనతికాలంలోనే, రియల్‌ ఎస్టేట్ కు మద్దతు తెలిపిన కంపెనీలు ఈ నియమాలకు కట్టుబడి, పట్టణీకరణ ప్రక్రియలో సాయపడ్డాయి.

టిఎంటి కడ్డీలు

టిఎంటి కడ్డీలు భారతదేశంలో భవన నిర్మాణ రంగ దృశ్యాన్ని వాటి అనుగుణ్యత; స్లాబ్‌లు, బీమ్‌లు, స్తంభాలు ఇంకా అనేక రకాల ఆకారాల్లో ఇమిడిపోయే వాటి సామర్థ్యం వల్ల మార్చివేశాయి.

వాటి అనుగుణ్యతకు మించి టిఎంటి కడ్డీలు వివిధ గ్రేడ్‌లలో చిన్న ఇళ్ళు, మధ్య సైజు వ్యాపార నిర్మాణాల నుంచి ఓడరేవులు, విమానాశ్రయాల లాంటి పెద్ద నిర్మాణాల వరకు సరిపోయే విధంగా ఉంటాయి. ఈ టిఎంటి కడ్డీలు సామాన్య ప్రజల జేబులకు చిల్లు చేయవు. అదేవిధంగా భద్రతే ముఖ్యం అనే విషయంలోనూ రాజీపడదు.

ఉక్కులో వివిధ లక్షణాలు గల వివిధ గ్రేడ్‌లు ఉన్నాయి :

  • Fe 415 అగ్నిని, భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం గలది.
  • Fe 550 తుప్పు నిరోధకత కలిగి ఉండటం వల్ల, సముద్రానికి దగ్గరలో వంతెనలు, నిర్మాణాలు కట్టడానికి ఇది ప్రాముఖ్యమైన ఎంపిక.
  • Fe 600 బలమైనది కావడం వల్ల విమానాశ్రయాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ఇది ప్రాముఖ్యమైన ఎంపిక

చివరిగా టిఎంటి కడ్డీలు భారత భవన నిర్మాణరంగంలో ఎందుకు మూలకారణంగా మారాయనేది తెలుసుకుంటున్నాం.