మా ప్రాధాన్యత

మా ప్రాధాన్యత

భారతదేశంలో ఉత్తమ నాణ్యత గల ఉక్కు కడ్డీ తయారీదారు. ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండరీస్‌ - భారతదేశంలో రీబార్‌ ఉక్కును తయారుచేసే ప్రముఖ ప్రాథమిక ఉక్కు తయారీసంస్థలలో ఒకటి. సురక్షితమైన మరియు సుస్థిరమైన ఉక్కును ఉత్పత్తి చేయాలన్న సిద్ధాంతాన్ని అనుసరించి, నాణ్యత గల కడ్డీలు, ఉక్కు, ఉక్కు ఉత్పత్తులలో అగ్రగామిగా నిలుస్తూ, అధునాతన సాంకేతికతతో వాణిజ్యం చేస్తూ మా గౌరవనీయులైన వినియోగదారుల నిర్దిష్టమైన అవసరాలకు అందుబాటులో ఉంటూ వస్తున్నాం.
బలమైన సమిష్టి కృషి, ప్రత్యేక తయారీ విధానం, నాణ్యత గల ఉత్పత్తులు, నైపుణ్యం గల సిబ్బంది ద్వారా విజయం సాధించవచ్చునని మా నమ్మకం. తద్వారా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది.

మా భవిష్యత్‌ ప్రణాళిక

ప్రాజెక్టులు, రిటైల్‌ వినియోగదారులు, వ్యాపార భాగస్వాములు కూడా ఉక్కు అవసరాలకు మమ్మల్నే ఎన్నుకునే స్థాయిలో మేము ఉంటూ, మరియు నాణ్యతా లోపం లేని ఉత్పత్తిని ఇవ్వడం ద్వారా మా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటాము.

మా కర్తవ్యం

బలమైన సమిష్టి కృషి, ఉత్తమ సాంకేతికత మరియు మానవ వనరులును ఉపయోగించి నాణ్యత గల ఉత్పత్తుల తయారీ, తద్వారా మార్కెట్కు తగిన పోటీధరలతో, చెప్పిన సమయానికి సరకును అందించే తక్షణ సేవ ద్వారా వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చడం ద్వారా విజయం సాధించగలము.

మా విలువలు

ఖాతాదారులకు విలువను అందించడం
ఉత్తమ వృద్ధి సాధించడానికి, మా అంతర్గత మరియు బయటి ఖాతాదారులకు నిరంతరం సేవలందించే సంప్రదాయాన్ని ప్రోత్సాహించడం ద్వారా మార్కెట్లోని మా పోటీదారులతో సమానంగా మా వినియోగదారులు అతిశయించే విధంగా ప్రత్యేకంగా నిలబడటం ద్వారా నమ్మశక్యం కాని విలువను సృష్టించడం.
వ్యక్తులను గౌరవించడం
గౌరవం అనేది ఒక ప్రాధమిక అంశం. అది ''పొందాలంటే మొదట ఇవ్వాలి'' అనే సూత్రాన్ని బట్టి ఉంటుందని విశ్వసిస్తాము. విలువలకు సంబంధించి ప్రతి వ్యక్తీ కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైనవాడే అని మా నమ్మకం. వ్యక్తి యొక్క శక్తిని ఉన్నతంగా చూపించడంలో, మా సంస్థ అగ్రగామిగా ఉండాలి అనే స్ఫూర్తిని సజీవంగా ఉంచి, సంస్థను వృద్ధి చేయడానికి మాకు ఉన్న విలువలతో గౌరవిస్తాము.
ఉత్తమ వ్యక్తులు
మా వ్యాపారం కొరకు ఉత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడం, అభివృద్ధిపరచడం, మరియు దానిని నిలుపుకోవడం ఒక సవాలు, వారిలో ''చేయగలము - చేస్తాము'' అనే వైఖరిని అభివృద్ధి చేయడం మరియు పరస్పరం సహకరించుకొనే వాతావరణాన్ని పెంపొందించడం.
నిజాయితీ
మా వ్యాపార కార్యాచరణలో ఉన్నతస్థాయి సమగ్రతకు కట్టుబడి ఉన్నాము. నిజాయితీ అనేది మా మూల విలువల్లో ఒకి, ఎందుకంటే మా విజయంలో అదొక ముఖ్యమైన అంశం అని మేము విశ్వసిస్తాము.
సాధికారత
ఏ వ్యక్తికి కూడా వారి స్వీయ ప్రమేయం లేకుండా ఏ అంశం న్యూనతా భావానికి గురిచేయదు. ఇక్కడ ప్రధాన విషయంగా నాయకత్వ లక్షణాలతో అన్ని సాధికారత స్థాయిలని దాటి వెళ్లగలదని మా నమ్మకం.
వినూత్నత
మా ఉక్కు మా అభిరుచికి ప్రతీక. అది మా ఉద్యోగుల అసమానమైన నైపుణ్యం మరియు అగ్రగామిగా నిలవాలన్న స్ఫూర్తి యొక్క మిశ్రమం. చివరికి వినూత్నత అనేది ఒక కళ అని ఉదహరిస్తాము.