గనుల నుంచి మిల్లుల వరకు సమగ్ర ఉక్కు కర్మాగారం
మాకున్న ఉన్నత నాణ్యతా ఉత్పత్తులు మరియు సేవకు కారణం ఏమిటటంటే మాకు గనుల నుంచి మిల్లుల వరకు సమగ్ర ఉక్కు కర్మాగారం సముదాయం ఉన్నదని చెప్పవచ్చు. ఇందువల్ల అత్యుత్తమ నాణ్యత గల ఉక్కు తయారు చేయడానికి BIS ప్రమాణాలకు మించి భౌతిక లక్షణాలు మరియు రసాయన సమ్మేళనాలు సాధించడానికి ఈ మొత్తం ప్రక్రియ మీద మాకు పూర్తి నియంత్రణ ఉంది. అంతేకాక సమగ్ర ఉక్కు కర్మాగారం కలిగి ఉండటం వల్ల కూడా మాకు నాణ్యత, ధరలు మరియు సమయానికి పంపిణీ చేయడంపై పూర్తి నియంత్రణ ఉంది.
ఎంఎస్ లైఫ్ 600 మా అధునాతన సమగ్ర ఉక్కు కర్మాగారంలో ఉత్తమ ప్రక్రియల కలయిక ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఎంఎస్ లైఫ్ 600 తయారీ కోసం ముడి ఇనుపఖనిజం ఉపయోగించి ప్రాధమిక ప్రక్రియ మార్గం ద్వారా ఉక్కు ఉత్పత్తి అవుతుంది. తరవాత కొలిమిలో ప్రాసెస్ చేయబడి స్వచ్ఛమైన ఉక్కు (virgin steel) సంపూర్తిగా శుద్ధి చేయబడి, వరసగా బిల్లేట్ల అచ్చులుగా పోతపోస్తారు. ఫలితంగా ఏర్పడిన ముడిఉక్కు హానికర పదార్థాలు లేని అత్యత్తమ నాణ్యతను కలిగి, రీబార్‌లలో కావలసిన మరియు అనుకూల లక్షణాలను ఇస్తుంది. .బిల్లేట్ అచ్చులు ప్రతి రీబార్‌లో ఒకే విధమైన లక్షణాలు ఉండేలా చేసే నియంత్రణ ప్రక్రియ పర్యవేక్షక యంత్రాలు కలిగిన పూర్తి ఆటోమేటెడ్ రోలింగ్ మిల్లులలో వేడి రోల్స్‌గా ఉంటాయి.
మా రోలింగ్ మిల్లులన్నీ సంప్రదాయ ఉక్కు రోల్స్ స్థానంలో అధునాతన టంగ్‌స్టన్ కార్బైడ్ రోల్స్ కలిగిన కొత్త రోలింగ్ సాంకేతికతలతో పూర్తిగా నవీకరించబడి అత్యుత్తమ పరిమాణ పరిమితి మరియు బాహ్యతలం శుద్ధీకరణ ఉంటుంది. కాబట్టి, ఫలితంగా ఏర్పడే ఉక్కు మంచి ఆకృతి, అధిక శక్తి, ఉత్తమ నాణ్యతను కలిగి ఉంటుంది.
